బహుళ, లిఫ్ట్ & పుషర్ యాక్సిల్ ట్రక్కులు

హాలేజ్ (సరుకురవాణా) విభాగం ట్రక్ యొక్క పవర్‍కు బరువు నిష్పత్తి అత్యధికంగా ఉంటుంది, అంటే ప్రతి ట్రిప్‌కు అతి తక్కువ సమయం పడుతుంది అని అర్ధం. ముతక యాగ్రిగేట్‍లతో నిర్మించబడి, ఇది ఇతర ట్రక్కుల కంటే కూడా ఎక్కువకాలం నిలుస్తుంది. అన్నింటికంటే ఎక్కువగా, ఇది తిరుగులేని సర్వీస్ ఇంకా స్పేర్ గ్యారెంటీలతో వస్తుంది, ఇదిHCV హాలేజ్ విభాగంలో Blazo Xని ఉత్తమ ఎంపికగా చేస్తుంది.

ఫీచర్లు & USPలు:

మరిన్ని ట్రిప్‍లు, అదనపు మైలేజ్:

BLAZO X యొక్క ధృఢనిర్మాణం అత్యధిక పవర్‍కు బరువు నిష్పత్తితో శక్తివంతమైన డ్రైవ్‌లైన్ వంటి బలమైన లక్షణాలతో మెరుగుపరచబడింది మరియు దాని అసమానమైన ఇంధన సామర్థ్యం మరియు నిరూపితమైన ఫ్యూయల్‍స్మార్ట్ టెక్నాలజీతో వేరేవాటి కంటే మేలైన పనితీరుకు హామీ ఇస్తుంది.

ఫ్యూయల్‍స్మార్ట్ అడ్వాంటేజ్:

మీరు సిమెంట్, ఆహార ధాన్యాలు, రాళ్ల బ్లాక్‌లు లేదా ఘనీభవించిన ఆహారాన్ని పంపిణీ చేసే వ్యాపారం దేనిలో ఉన్నా, సరుకు రవాణా విభాగంలో ప్రతి రవాణా అప్లికేషన్ కోసం ఒక ట్రక్కు ఉంది. ఇంకా మీరు ఏ ట్రక్కు ఉపయోగించినాగానీ, మీకు ఎల్లప్పుడూ ఫ్యూయల్‍స్మార్ట్ ప్రయోజనం ఉంటుంది.

మల్టీమోడ్ స్విచ్‌లతో కూడిన mPOWER ఫ్యూయెల్‌స్మార్ట్ ఇంజిన్:

Blazo X ట్రక్కుల mPOWER ఫ్యూయల్‍స్మార్ట్ ఇంజిన్ మల్టీ-మోడ్ స్విచ్‌ల సమ్మేళనంతో వచ్చి రాజీపడని పనితీరును అందిస్తుంది. ఫ్యూయల్‍స్మార్ట్ బటన్‌లు మీ వ్యాపారానికి ఎప్పుడు అవసరమైతే ఆ విధంగా అధిక మైలేజ్ ఇంకా తిరుగులేని పవర్ మధ్య ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. అది ఉండగలిగినంత ఉత్తమంగా, ఉండగలిగినంత సరళంగా ఫ్యూయల్‍స్మార్ట్ టెక్నాలజీ.

iMAXX టెలిమాటిక్స్‌తో మీ లాభాన్ని అత్యధికం చేసుకోండి:

iMAXX ఖచ్చితమైన రీఫిల్‌లు, లైవ్ ట్రాకింగ్, సూచించే వాహన హెల్త్ మానిటరింగ్, ఇంధన సామర్థ్య విశ్లేషణ, దొంగతనం హెచ్చరికలు, ఇంధన వినియోగం, AdBlue మానిటరింగ్, డ్రైవర్ ప్రవర్తన మానిటరింగ్ ఇంకా ఎన్నో ఆటోమేటెడ్ ఆపరేషన్ రిపోర్ట్‌ల వంటి తెలివైన ఫీచర్‌లతో వస్తుంది.

డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్:

Blazo Xలోని రియల్ టైమ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (DIS) డ్రైవర్‌కు అదే సమయంలో కీలకమైన వాహన సమాచారాన్ని అందిస్తుంది. ఇంజిన్ r/నిమి, ఉష్ణోగ్రత, వేగం ఇంకా ఇంధన స్థాయిలే కాకుండా, ఇందులో బ్రేక్ ప్రెజర్, ట్రిప్ కిమీ, ప్రతి కిమీకి డీజిల్ వినియోగం, బ్యాటరీ వోల్టేజ్, సర్వీస్ రిమైండర్‌లు ఇంకా ఇతర ముఖ్యమైన వివరాలు ఉంటాయి.

మెరుగైన ఉత్పాదకత కోసం మెరుగైన క్యాబిన్

4-పాయింట్ సస్పెండ్ చేయబడిన క్యాబిన్ నిజంగా డ్రైవింగ్ సౌకర్యాన్ని పెంచుతుంది, క్యాబిన్ లోపల ప్రయత్నాన్ని తగ్గించడానికి ఎర్గోనామిక్‌గా ఉండే కంట్రోల్స్. Blazo X సురక్షితమైన, అలసట-లేని డ్రైవింగ్ కోసం నిర్మించబడింది, అంటే డ్రైవర్లకు తక్కువ స్టాపేజ్‌లు, తక్కువ సమయంలో ఎక్కువ దూరం కవర్ చేయడం ఇంకా మెరుగైన పని పూర్తిచేయడానికి పట్టే సమయం అని అర్ధం.

తరచుగా అడిగే ప్రశ్నలు

మహీంద్రా హాలేజ్ విభాగాలు Blazo X ట్రక్లు 10R20-16 PR, రేడియల్ టైర్లు, 10+1 టైర్లతో వస్తాయి.

మహీంద్రా Blazo ట్రెండింగ్ మోడల్ ఇంకా HCVలో: హాలేజ్, టిప్పర్, ఇంకా ట్రాక్టర్ ట్రైలర్ విభాగంలో వస్తుంది. ఇందులో 280 HP పవర్డ్ mPower 7.2 లీటర్ ఫ్యూయల్‍స్మార్ట్ ఇంజన్, అధిక టార్క్, తక్కువ r/నిమి ఇంజన్ ఉండి ఇది 1050 NM ఉత్పత్తి చేస్తుంది. హెవీ డ్యూటీ కమర్షియల్ ట్రక్కు 415 లీటర్లు సామర్థ్యంగల ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది.

టాండమ్ యాక్సిల్ ట్రైలర్ అని కూడా పిలవబడే డబుల్ యాక్సిల్ ట్రైలర్ అనేది ఒక రకమైన వెనుక-కట్టి లాగే ప్లాట్‌ఫారమ్, ఇందులో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు అమర్చబడి రెండు యాక్సిల్స్ ఉంటాయి. డబుల్ యాక్సిల్ ట్రైలర్ ఉద్దేశ్యం ఏమిటంటే, ఒక టోయింగ్ వాహనం వెనుక భారీ వస్తువులు లేదా అనేక వస్తువులను సురక్షితంగా మరియు పదిలంగా లాగడానికి వినియోగదారుని అనుమతించడం.

భారీ వాణిజ్య వాహనాలు అనేది వాణిజ్య వాహనాల రంగం యొక్క అతి విశాలమైన మరియు భారీ శ్రేణి విభాగం. HCV రేంజ్ 18.5T నుండి మొదలై 55T GVW వరకు ఉంటుంది, ఇందులో మల్టీ-యాక్సిల్, హాలేజ్, ట్రాక్టర్-ట్రైలర్ ఇంకా టిప్పర్ ఉంటాయి.

మహీంద్రా Blazo X 46 ట్రాక్టర్ ప్లస్‌లో ఆటంకాలు-లేని పని కోసం mPower 7.2 లీటర్ ఫ్యూయల్‍స్మార్ట్ ఇంజన్ అందించబడింది. అదనంగా, హెవీ-డ్యూటీ కమర్షియల్ ట్రక్‌లో మల్టీ-యాక్సిల్స్ ఇంకా హై-గ్రేడ్ టెక్నాలజీ అమర్చబడి ఉంది, ఇది భారీ పేలోడ్‌లను మోసుకెళ్లడంలో సహాయపడుతుంది అలాగే వివిధ భారత భూభాగాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్‌కు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.