ట్రాక్టర్ ట్రైలర్ ట్రక్కులు

మహీంద్రా వారి హెవీ కమర్షియల్ ట్రాక్టర్ ట్రెయిలర్ ట్రక్స్ ఖచ్చితమైన అత్యధిక మైలేజ్ కలిగి ఉంటాయి. ఫ్యూయెల్ ఎకానమీ విషయంలో, ఇవి అన్నిటికన్నా ముందు మరియు ఆపరేటింగ్ ఖర్చుల విషయంలో అన్నిటికన్నా తక్కువ ఉంటాయి.

ఫీచర్లు & USPలు:

ప్రతి ఆటోమోటివ్ డెలివరీతోను ఖచ్చితమైన ఎక్స్ట్రా ఆదాలు:

మహీంద్రా వారి ట్రాక్టర్ ట్రెయిలర్స్ లోని mPOWER స్విచ్, ఫుల్ లోడ్స్ ని మోసుకెళ్తున్నప్పుడు హెవీ మోడ్ లో టర్న్ ఆన్ చెయ్యనిస్తుంది. పెద్ద లోడ్స్ ని ఏటవాలు ప్రదేశాలలో ఎత్తుగా వెళ్తున్నప్పుడు టర్బైన్ మోడ్ లో పెట్టండి. లేదా ఏ లోడ్ లేనప్పుడు, లైడ్ మోడ్ లో పెట్టి, గరిష్టమైన ఎఫిషియెన్సీని పొందండి.

సునాయాసంగా కంటెయినర్లను మువ్ చేస్తుంది మరియు ఎక్స్ట్రా ఇంధనాన్ని ఆదా చేస్తుంది:

మహీంద్రా HCV యొక్క ట్రాక్టర్ ట్రెయిలర్ ఒక 7.2-లీటర్ mPOWER FuelSmart డిస్ ప్లేస్ మెంట్ తో వస్తుంది. అత్యధిక రిజర్వ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ ఇంజను, మల్టీ మోడ్ స్విచ్ ల కలయికతో, రాజీపడని పర్ఫార్మెన్సుని ఇస్తుంది. మీకు పవర్, పికప్ లేదా పుల్లింగ్ ఎబిలిటీ కావలసినప్పుడు, ఎటువంటి ధోకాలేకుండా మైలేజిని ఇస్తుంది.

మరింత సౌకర్యం, మరిన్ని ప్రయాణాలు:

మహీంద్రా వారి ట్రాక్టర్ ట్రెయిలర్ ట్రక్స్ సురక్షితమైన, అలసట రహితమైన డ్రైవింగ్ కోసం నిర్మించబడతాయి. అంటే, డ్రైవర్ తక్కువ స్టాపేజ్ లు చేస్తాడు, తక్కువ టైములో ఎక్కువ దూరం కవర్ చేస్తాడు. ఇంకా మెరుగుపడిన టర్న్ అరౌండ్ టైం. వెడల్పాటి విండ్ షీల్డ్ మరియు విశాలమైన రియర్- వ్యూ మిర్రర్స్ మరింత ఎక్కువ విజిబిలిటీని అందజేస్తాయి. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం, హెచ్చు స్పీడ్స్ లో కూడా, బ్రేకింగ్ కంట్రోల ఉండేలా రూఢి పరుస్తుంది.

అప్లికేషన్స్ (వాడుకలు):

ట్రాక్టర్ ట్రెయిలర్ వంటి హెవీ కమర్షియల్ వెహికల్స్ కన్ స్ట్రక్షన్ మెటీరియల్, మెషినరీ,స్టీల్, మార్బుల్స్, కంటెయినర్స్, ఆటో మరియు టూ- వీలర్ క్యారియర్స్, ఆయిల మరియు గ్యాస్ ట్యాంకర్ల కోసం వాడబడతాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

మహీంద్రా ట్రాక్టర్ ట్రెయిలర్ ట్రక్ కి 39500 kgల, 45500 kgల, 55000 kgల GVW ఉంటుంది.

మహీంద్రా బ్లేజో X 40 ట్రాక్టర్ ట్రెయిలర్ భారతీయ మార్కెట్లలో `29.34 లక్షల ప్రారంభిక షోరూమ్ ధరలో లభ్యమౌతోంది.

"ట్రాక్టర్ ట్రెయిలర్" మరియు "18 వీలర్" అనేవి రెండూ సెమీ- ట్రక్ మరియు దాని ట్రెయిలర్ కలయికను సూచిస్తుంది. రెండూ కలిసి ఒక ట్రాక్టర్ ట్రెయిలర్ యూనిట్ అవుతాయి, దీనినే 18 వీలర్ అని కూడా పిలుస్తారు- అంటే యూనిట్ కి ఉన్న వీల్స్ సంఖ్య అన్నమాట.

మహీంద్రా బ్లేజో X 55 ట్రాక్టర్ ట్రెయిలర్ అనేది 7200 cc, mPOWER 7.2-లీటర్ FuelSmart ఇంజన్ చేత పవర్ చెయ్యబడుతుంది. ఇది శక్తివంతమైన పర్ఫార్మెన్సుతో 274 హార్స్ పవర్ని, 1050 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.